26న కడపలో సీఎం జగన్ పర్యటన

ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:01 IST)
ఈ నెల 26న కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జలదరాశి రిజర్వాయర్, కుందూ-2 రిజర్వాయర్ పనులతో పాటు గండికోట-చిత్రావతి పథకాల అప్గ్రెడేషన్ పనులను సీఎం ప్రారంభించనున్నారు. 
 
పులివెందులకు నీరిచ్చేందుకు మొగవాగు, కుందూ ఎత్తిపోతల ఇలా వేర్వేరు పథకాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జలనవరుల శాఖ ప్రతిపాదనల్ని సిద్ధం చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 
 
ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన అనంతరం పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టారు. మొత్తం 5 వేల కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలియచేసినట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు