సీఎం జగన్ అక్రమాస్తుల కేసు : ఇకపై రోజువారీ విచారణ

గురువారం, 28 అక్టోబరు 2021 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఇకపై తెలంగాణ హైకోర్టులో గురువారం నుంచి రోజువారీ విచారణ ప్రారంభంకానుంది. కేసుకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెల్సిందే.
 
ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలను త్వరగా తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టనుంది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో సహా 2012 నుంచి దాఖలైన 40 వ్యాజ్యాలను విచారణ జాబితాలో ఉన్నత న్యాయస్థానం చేర్చింది. 
 
కింది కోర్టులో విచారణలో ఉన్న 12 చార్జ్ షీట్లలో నిందితులుగా ఉన్న పలు సంస్థల వ్యక్తులు, వారిపై నమోదైన కేసులను కొట్టివేయాలని, స్టే ఉత్తర్వులు పొడిగించాలని కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిన్నింటిపై రోజు వారీ విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ధర్మాసనం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు