ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారంచుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి.. సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు.
వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద మహానేతకు వైఎస్ జగన్, కుటుంబసభ్యులతో పాటు... తరలివచ్చిన వైఎస్సార్ సీపీ నేతలు.. అశేషమైన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలతో ఇడుపుపాలపాయ కిక్కిరిసిపోయింది.