లండన్ నుంచి గన్నవరంకు సీఎం జగన్.. ఎన్నికల ఫలితాలపై సమీక్ష

సెల్వి

శనివారం, 1 జూన్ 2024 (10:41 IST)
లండన్‌ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి జగన్‌ శనివారం తెల్లవారుజామున గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. 
 
గన్నవరంలో దిగిన సీఎం జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకుని అక్కడ 11 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో త్వరలో జరగనున్న కౌంటింగ్‌కు సన్నాహకంగా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. 
 
ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నట్లు వెల్లడించాయి.
 
15 రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్ లలో పర్యటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబసమేతంగా సీఎం వైయస్‌ జగన్ ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైయస్‌ జగన్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/yIgFKb9fv8

— YSR Congress Party (@YSRCParty) June 1, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు