మార్కెట్‌లోకి బీఎన్‌పీ పరిబాస్ బ్యాలెన్స్‌డ్ ఫండ్

బుధవారం, 22 మార్చి 2017 (16:07 IST)
బీఎన్‌పీ పరిబాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్టనర్స్ (ఇండియా) కంపెనీ తాజాగా బీఎన్‌పీ పరిబాస్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇందులో ఒకేసారి కనిష్టంగా ఐదు వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
రూ.5 వేలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి నెల కనిష్టంగా రూ.500 కూడా పెట్టుబడిగా పెట్టొచ్చని బీఎన్‌పీ పరిబాస్ అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఆనంద్ షా తెలిపారు. 
 
ఇదే విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు తమ కంపెనీ సర్వదా సిద్ధంగా ఉంటుందన్నారు. తమ కంపెనీ దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ తరహా ఫండ్‌ను ప్రవేశపెట్టడం ఇది 14వ సారి అని చెప్పారు. తమ కంపెనీ టోటల్ యావరేజ్ అసెట్స్ రూ.5977 కోట్లుగా ఉందని ఆయన గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి