1995లో ఎన్టీఆర్ కేజీహెచ్‌లో అడుగుపెట్టాక పదవి పోయిందని... ఆ తర్వాత అక్కడ మరే ముఖ్యమంత్రి అడుగుపెట్టలేదని వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తెలిపారు. మళ్లీ ఇప్పుడు జనాల కోసం వైస్. జగన్ అడుగుపెట్టారని వరప్రసాద్ చెప్పారు.
ఇకపోతే.. విశాఖ కేజీహెచ్‌లో అడుగు పెడితే పదవి పోతుందనే ఎప్పటి నుంచో సెంటిమెంట్ ఉందట. గతంలో ఎన్టీఆర్ ఆస్పత్రిలో అడుగు పెట్టి ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారట. అప్పటి నుంచి సీఎంలు, పదవుల్లో ఉన్నవారు అక్కడికి వెళ్లరనే ప్రచారం ఉంది. అంతేకాదు గత ప్రభుత్వంలో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యిందట.