వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఒక అమ్మాయి ఉంది. 25 యేళ్లు ఉంటాయి అని ఓ మహిళ అంబటిని అడగ్గా.. ఆ అమ్మాయిని పంపించు... నాకు అన్నీ కావాలి అంటూ అంబటి సమాధానం చెబుతున్నట్టుగా ఉండే ఒక ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా చివరకు అంబటి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ఫేక్ వీడియో అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఇకపోతే ఈ వివాదం నిజమే అయితే వైసీపీ అధిష్టానం తప్పక ఆయనపై వేటు వేసేదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.