ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (18:44 IST)
శాసనమండలి ఎన్నికల కోసం వైకాపా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్లతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. 
 
ఈ అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడు బల్లి కల్యాణ్ చక్రవర్తికి, ఎ‌మ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డికి వైకాపా అవకాశం కల్పించింది. 
 
ఇక కడప జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య, శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఇక్బాల్‌ను మరోసారి మండలికి పంపాలని వైకాపా నిర్ణయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయవాడకు చెందిన కరీమున్నిసా పేరు ఖరారు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు