రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది. కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. కీలకమైన పాలసీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్దనే నిలకడగా కొనసాగుతోంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంది.