రఘురామరాజు ఐఫోన్‌ను తీసుకున్న ఏపీ సీఐడీ... లీగల్ నోటిసులు

శనివారం, 5 జూన్ 2021 (09:57 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు సమయంలో ఆయన ఐఫోన్‌ను ఏపీ సీఐడీ పోలీసులు తీసుకున్నారు. ఈ ఫోనును ఇవ్వాలంటూ వారికి రఘురామ రాజు లీగల్ నోటీసులు పంపించారు. ఈ మేరకు ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌ను ఉద్దేశిస్తూ లీగల్ నోటీసు జారీ చేశారు. 
 
తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని, దాన్ని తిరిగిచ్చేయాలని కోరారు. స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని రఘురామ ఆరోపించారు. ఆ ఫోనులో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
 
పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోనులో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందని స్పష్టంచేశారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోనును అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మంగళగిరి సీఐడీ హెచ్ఎస్ఓకు ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు