కావలిలో వితంతువుపై వైకాపా రౌడీషీటర్ దాష్టీకం... జట్టుపట్టుకుని రక్తస్రావమయ్యేలా కొట్టాడు..

సోమవారం, 19 జూన్ 2023 (10:02 IST)
ఏపీలో అధికార వైకాపా నేతల ఆగడాలు రోజురోజుకూ హెచ్చుమీరిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం, మహిళలు, చిన్నారులు, వృద్ధులపై వారి ఆగాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా రౌడీ షీటర్ దర్శిగుంట మహేంద్ర రెచ్చిపోయాడు. ఓ వితంతువుపై విచక్షణారహితంగా చావబాదాడు. ఆమెను జట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చి... రక్తస్రావమయ్యేలా చితకబాదాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కావలి పట్టణంలోని షాదీ మంజిల్ సమీపంలో చిల్లర దుకాణం నిర్వహిస్తున్న కరకట్ట పార్వతి అనే వితంతు మహిళ స్థానిక రౌడీషీటర్, వైకాపా నాయకుడు దర్శిగుంట మహేంద్ర కుటుంబం వద్ద యేడాది క్రితం రూ.50 వేలు నెలకు నూటికి రూ.20 వడ్డీకి అప్పు తీసుకుంది. అసలుతో పాటు వడ్డీ రూ.50 వేలు చెల్లించినట్లు బాధితురాలు చెబుతున్నారు. ఇంకా మరో రూ.65 వేల వరకు ఇవ్వాలంటూ మహేంద్ర, మరో ఏడుగురు మద్యంమత్తులో ఆమె దుకాణం వద్దకు శనివారం రాత్రి వచ్చి వీరంగం సృష్టించారు. 
 
ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు. జుట్టుపట్టుకుని.. రక్తస్రావమయ్యేలా కొట్టారు. ఆడ్డు వచ్చిన బాధితురాలి తల్లి, కుమారుడిపైనా దౌర్జన్యం చేశారు. దుకాణం వదిలేసి వెళ్లిపోవాలని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సన్నివేశాలను చిత్రీకరించకుండా వారి ఫోన్‌లన్నీ ముందుగానే లాగేసుకున్నారు. ఆ తర్వాత బాధితులు ఒకటో నంబర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా పట్టించుకోలేదు. దీంతో స్టేషన్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు