పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ

గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ వరంగల్ సమీపంలో చింతపల్లి రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి పట్టాలు తప్పింది. విజయవాడ- వరంగల్ మార్గంలోని లూప్‌లైన్, మరో మెయిన్ లైనులపై రెండు గూడ్సు రైళ్లు ఆగి వున్నాయి. దీంతో విజయవాడ నుంచి వస్తున్న ఇంటర్ సిటీని లూప్‌లైన్‌లోకి తీసుకుని మళ్లీ మెయిన్‌లోకి పంపిస్తుండగా ప్రమాదం జరిగింది.

పట్టాలు మారుతున్న సమయంలో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదం గురించి తెలుసుకోగానే కాజీపేట నుంచి ప్రత్యేక రైలు, వైద్య వాహనం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పట్టాలు తప్పిన ఇంజన్ వెనుక బోగీకి అవసరమైన మరమ్మతులు చేసి పట్టాలను సరిచేశారు. ప్రమాదం కారణంగా రైలు రాకపోకలకు అంతరాయం కలిగి పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

వెబ్దునియా పై చదవండి