ఎన్నికల ఖర్చుల్లో వినుకొండ ఫస్ట్..!

ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసినాకూడా ఎన్నికల వాతావరణం వేడెక్కి ప్రజలు బేజారెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మే 28వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.

కాబట్టి కోడ్ ముగిసిన నెల రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కోడ్ ముగిసిన నెల రోజుల్లోగా అభ్యర్థులు తాము ఖర్చు చేసిన వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి లోక్‌సభకు 25 లక్షల రూపాయలు, అసెంబ్లీకి 10 లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవచ్చు.

ఇదిలావుండగా గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థులు రాష్ట్రంలో అత్యధికంగా 40 కోట్ల రూపాయలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రూ. 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎన్నికల నిఘా వేదిక పరిశీలకులు కేజే రావు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

గుంటూరు పశ్చిమ, గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్న అభ్యర్థులు వ్యాపార దిగ్గజాలు కావడంతో ఇక్కడ డబ్బులను నీళ్ళలా ఖర్చు చేసినట్లు సమాచారం. మరి ఇతర ప్రాంతాలలో ఎవరెవరు ఎంతమేరకు ఖర్చు చేసారనేదానిపై విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి