EVM ల ద్వారా జరుగుతున్న ఓటింగ్ పైన గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో EVMల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకు రావాలంటూ దాఖలైన పిటీషన్‌ను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ... మీరు గెలిస్తే EVM లు సరిగ్గా పనిచేస్తున్నట్లా.. మీరు గెలవకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నట్లా అని ప్రశ్నించింది. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకురావాలన్న పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చుతూ పై వ్యాఖ్యలు చేసింది.