నిజాం ఖజానా సందర్శనం... వీక్షించండి

సోమవారం, 21 ఏప్రియల్ 2008 (20:15 IST)
WD
ప్రాచీన భారతం సంపదల నిలయం. మణిమాణిక్యాలు... వజ్రవైఢూర్యాలతో దేశం ధగధగలాడుతుండేది. స్వదేశ రాజులు ఒకరిపై మరొకరు యుద్ధాలు సాగించినా విజయం సాధించిన రాజుల అధీనంలో అలరారుతుండేది. విదేశీ హస్త లాఘవంతో నాటి ఐశ్యర్యంలో చాలామటుకు మాయమైంది. అయితే నాటి ఐశ్వర్యాన్ని కళ్లముందు నిలిపే కొన్ని ఆనవాళ్లు మాత్రం మనకు నేటికీ కనువిందు చేస్తూనే ఉన్నాయి.

అటువంటి వాటిలో మన రాష్ట్ర రాజధాని... ఒకప్పటి భాగ్యనగర పాలకులైన నిజాం వజ్రకచిత సంపద. నాటి వారి సంపద ఔరంగజేబునే ఔరా అనిపించిందట. దాదాపు రెండు శతాబ్దాలపాటు నిజాం ప్రాభవం కొనసాగింది. ఏడో నిజాం తన ఆస్థిలో కొంత భాగాన్ని తమ అనుయాయులకు పంచగా మిగిలిన దానిని ప్రభుత్వం ఖజానాకు తరలించింది. నిజాం ప్రభువుల ఆస్థి స్వరాజ్యంలోనే కాదు... విదేశీ బ్యాంకులలోనూ జమయ్యాయి. ఆ ఆస్థిని వెనకకు తీసుకునే క్రమంలో నేటికీ వివాదం సాగుతుందంటే ఆశ్చర్యం కలుగుక మానదు. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి