శనివారం (15-05-2021) రాశిఫలితాలు - సత్యనారాయణ స్వామిని పూజించినా..

శనివారం, 15 మే 2021 (04:00 IST)
మేషం : వ్యాపారాల అభివృద్ధికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. దైవ, దర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఆర్డరు చేతికందుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. కీలకమైన వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో అసంతృప్తి మిమ్మలను వెన్నాడుతూ ఉంటుంది. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత ముఖ్యం. గృహ నిర్మాణాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
మిథునం : ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. ప్రారిశ్రామిక రంగాల వారికి ఇసుకు, క్వారీ, కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. దూరపు బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : ఉపాధ్యాయ దంపతులకు ఒకే చోటికి బదిలీ వస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. తీర్థయాత్రలు, దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. మిత్రులతో రహస్య చర్చలు ఫలిస్తాయి. మీపై శకునాలు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. 
 
సింహం : వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సిమెంట్ రంగాలలోనివారికి, ఇసుక వ్యాపారస్తులకు సత్ఫలితాలు పొందుతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఉద్యోగం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. విలాసాస కోసం ధనం వ్యయం చేస్తారు. 
 
కన్య : కాంట్రక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయలో లౌక్యంగా వ్యవహరించండి. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. 
 
తుల : ఆర్థిక విషయాల్లో సంతృప్తికానరాదు. పత్రికా సిబ్బందికి వార్త ప్రచురణలో పునరాలోచన చాలా అవసరం. ప్రతి విషయంలోనూ ఏకాగ్రత, సంయమనం బాగా అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. 
 
వృశ్చికం : రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు. 
 
ధనస్సు : దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానీయ తినుబండారు వ్యాపారులకు లాభం. రాబోయే ఆదానియికి తగ్గట్టుగా లెక్కులు వేసుకుంటారు. నూతన ప్రదేశ సందర్శనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం : ఉద్యోగస్తులకు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. స్త్రీలకు ఉదరం. మోకాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికం. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
కుంభం : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. రావలసిన పత్రాలు రశీదులు చేతికందుతాయి. మీ అంచనాలు ఊహలు ఫలిస్తాయి. 
 
మీనం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమ అధికం. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు