అన్ని విధాలా అనుకూలం. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనుల్లో శ్రమ అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పత్రాలు అందుకుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం ఊరటనిస్తుంది.
ఉత్సాహంగా శ్రమించండి. సాయం ఆశించవద్దు. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీపై వచ్చిన ఖర్చులు అదుపులో ఉండవు. ఆరోగ్యం జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. వాయిదా వేసిన మొక్కులు తీర్చుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. అనుకోని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు సాగవు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ మంటపాలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల ధోరణి అసహనం కలిగిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు అధికం. ఆప్తుల సాయం అందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
ఒప్పందాల్లో మెలకువ వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొంత మంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు.
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు.