20-09-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. సూర్య నారాయణ పారాయణ చేసినా...?
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (04:00 IST)
సూర్య నారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది.
మేషం: ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా వుండటం మంచిది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
వృషభం: స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. బంధుమిత్రులతో లౌక్యంగా మెలగవలసి వుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసివస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన కుటుంబ అవసరాలు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.
మిథునం: సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. స్త్రీల ప్రతిభకు, వాక్చాతుర్యానికి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరం. అనుక్షణం భాగస్వామికుల తీరును గమనించడం శ్రేయస్కరం. విలువైన పత్రాల విషయంలో మెలకువ వహించండి. విద్యార్థులకు ఉన్నత కోర్సుల్లో అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు రాత, మౌఖిక, పరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పత్రికా, ప్రైవేట్ రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి.
సింహం: మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం, వాహనయోగం వంటి శుభ సంకేతాలున్నాయి.
కన్య: విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యవసాయ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికంగా వుంటుంది.
తుల: చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చికం: నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని అందుకోవడం క్షేమదాయకం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు.
ధనస్సు: ఊహించని సంఘటనలు, ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చగలుగుతారు. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది. షేర్ల కొనుగోళ్ళు లాభిస్తాయి.
మకరం: సర్దుబాటు ధోరణిలో వ్యవహరించిన గాని సమస్యలు పరిష్కారం కావు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆటంకాలు అధికమవుతాయి. దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. వృత్తులు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్లే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
కుంభం: ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్త్రీల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
మీనం: మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపు చేయటం కష్టం. రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత బాగా అవసరం. మీ తొందరపాటు నిర్ణయాలు, చర్యల వల్ల వ్యవహారం బెడసికొట్టే ఆస్కారం వుంది. ప్రతి విషయంలోను అనుభవజ్ఞులను సలహా పాటించడం మంచిది.