26-02-2020 బుధవారం మీ రాశి ఫలితాలు.. మహావిష్ణువును ఆరాధించినట్లైతే..?

బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (05:00 IST)
మహావిష్ణువును ఆరాధించినట్లైతే పురోభివృద్ధి పొందుతారు. 
 
మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్ధిస్తారు. 
 
వృషభం: దంపతుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. కొన్ని విషయాల్లో మీరెంత తెలివిగా వ్యవహరించినా ఫలితాలు భిన్నంగానే ఉంటాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. కాంట్రాక్టర్లకు కార్మికులతో సఖ్యత నెలకొంటుంది. వృత్తిపరమైన ఆటంకాలు క్రమంగా తొలగిపోగలవు.
 
మిథునం: విదేశీ యత్నాలు వాయిదా పడతాయి. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. భాగస్వామికుల మాటతీరు, కదలికలను గమనించడం ఎంతైనా మంచిది. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. తలపెట్టిన పనులు వేగవంతమవుతాయి. ప్రైవేట్, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదా పడతాయి.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. 
 
సింహం: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. విద్యా సంస్థల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. రుణయత్నాలు మాత్రమే ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులు వైఖరిని సమీక్షించుకుంటారు.
 
కన్య: మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమస్యలు పరిష్కారం కావని గ్రహించండి. ఇతరుల మెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసివస్తుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల: రవాణా రంగాల్లోని వారికి చికాకులు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. ప్రయాణాల్లోనూ, బ్యాంక్ వ్యవహారాల్లోనూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. పత్రికా, ప్రైవేట్ రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు, వైద్యులకు అనుకూలత. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరవుతాయి. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకునేందుకు మరింతగా శ్రమించాల్సి వుంటుంది. 
 
ధనుస్సు: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. స్త్రీలతో అతిగా సంభాషించడం వల్ల అపార్థాలకు గురికావాల్సి వుంటుంది. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది మెళకువ వహించండి. స్థిరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం మంచిది. 
 
మకరం: నిర్మాణ పనుల్లో జాప్యం, అధిక వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. రావలసిన ధనం వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పత్రికా సంస్థల్లోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులను అధికంగా ఎదుర్కొంటారు.  
 
కుంభం: కిరణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. గతంలో మిమ్ములను విమర్శిచిన వారే మీ సహాయం అర్ధిస్తారు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పనిచేయాల్సి వుంటుంది. సభాసమావేశాల్లో పాల్గొనడం వల్ల ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
 
మీనం: ఆర్థిక పరిస్థితుల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రికా, ప్రైవేట్ రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. చిన్న చిన్న విషయాలకు ఉద్రేక పడటం మంచిది కాదని గ్రహించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు