01-06-2024 శనివారం దినఫలాలు - కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందుతుంది...

రామన్

శనివారం, 1 జూన్ 2024 (04:00 IST)
మేషం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. స్థిరచరాస్తుల విషయమై కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తికరంగా ఉంటుంది. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు.
 
వృషభం :- కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఏ.సి., ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాలవారికి పురోభివృద్ధి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
మిథునం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాభివృద్ధి కానవచ్చిన, పనివారితో చికాకులు తప్పవు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి.
 
కర్కాటకం :- కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావటంతో తీరిక, విశ్రాంతి ఉండవు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ వహించండి.
 
సింహం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. అవివాహితులలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ చుట్టుప్రక్కల వారు మీ సహాయం అర్థిస్తారు.
 
కన్య :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. కంది, మినుము, శనగలు ధాన్యం రంగాల్లో వారికి సత్కాలం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడగలవు.
 
తుల :- నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. కుటుంబీకులతో కలసి ఆలయ సందర్శనాలలో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. పీచు, ఫోం, లెదర్, ఫర్నీచర్ వ్యాపారులకు కలిసిరాగలదు. ముఖ్యమైన వ్యవహారాలలో కొంతమంది మాటతీరు మీకు మనస్తాపం కలిగిస్తుంది.
 
వృశ్చికం :- సిమెంటు, ఇటుక, ఇసుక రంగాల్లో వారికి అభివృద్ధి కానవస్తుంది. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసిన సహాయానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎన్ని అవరోధాలు తలెత్తిన వ్యాపారరంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మిత్రుల ద్వారా అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఆసక్తి కలిగిస్తుంది.
 
ధనస్సు :- మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. కుటుంబీకులతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ఖర్చులు అధికమవుతాయి.
 
మకరం :- ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయంచేసి విషయంలో పునరాలోచన అవసరం. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించంటం మంచిది. భాగస్వామికుల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నం వాయిదా వేయడం మంచిది.
 
కుంభం :- స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. ఒకరి వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ లక్ష్యసాధనకు ముఖ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు.
 
మీనం :- మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు