అక్టోబర్ 4 తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని, ఆ వాహనం నటిదేనని అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం, కిరణ్ జి, అతని బంధువులు అనుష, అనితతో కలిసి మోటార్ సైకిల్ నడుపుతుండగా, ఒక గుర్తు తెలియని మహిళ నడిపిన నల్లటి కారు ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం ఆమె అక్కడ నుంచి పారిపోయిందని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనలో పరారైన దివ్యపై బెంగళూరు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. అంతేకాక, ఆమె కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో దివ్యను విచారించేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు.