02-07-2022 శనివారం రాశిఫలాలు ... వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం...

శనివారం, 2 జులై 2022 (04:00 IST)
మేషం :- స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులు అధికారుల నుండి మెప్పు పొందుతారు. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే పరిస్థితులు సర్దుకుంటాయి. స్త్రీలు పనివారితో చికాకులును ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి.
 
వృషభం :- విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్, కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికరుల నుంచి గుర్తింపు లభిస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది. రవాణా రంగాల వారికి ఆందోళనలు వంటివి అధికమవుతాయి.
 
మిథునం :- వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్యీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీల ఆరోగ్యములో సంతృప్తికానరాదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సభ సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఖర్చులు తగ్గించు కోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది.
 
కర్కాటకం :- ఉన్నతస్థాయి ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెలకువ వహించండి. బంధుమిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
సింహం :- దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు.
 
కన్య :- కిరణా, ఫ్యాన్సీ, కొబ్బరి, పూల, పండ్ల వ్యాపారులకు శుభదాయకం. ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న బలమైన కోరిక నెరవేరుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
తుల :- ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు దూరప్రదేశంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కొన్ని సమస్యలు మబ్బు విడినట్లు విడిపోవును. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.
 
వృశ్చికం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. శారీరక శ్రమ, మానసికాందోళనల వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలు టి.వి. ఛానల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు.
 
ధనస్సు :- రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. స్థిరచరాస్తుల విషయంలో సంతృప్తి కానవస్తుంది. మిత్రుల కలయికతో గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక స్థితిలో ఏమాత్రం లోటుండదు. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికం.
 
మకరం :- వ్యాపార రంగాలలోని వారికి గణనీయమైన అభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ అపరిచిత వ్యక్తులతో మెళుకువ అవసరం. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి.
 
కుంభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాలల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. విదేశాలు వెళ్లటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్లీడర్లకు, పీడరు గుమాస్తాలకు అనుకూలం. మీ శ్రీమతి వైఖరిలో మీరు ఆశించిన మార్పు సంభవిస్తుంది.
 
మీనం :- ట్రాన్సు పోర్టు, ఆటోమోబైల్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. విద్య సంస్థలలో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కుంటారు. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు