04-03-2024 ఆదివారం దినఫలాలు - వృత్తుల వారికి మిశ్రమ ఫలితం...

రామన్

సోమవారం, 4 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ ఐ|| నవమి రా.2.45 జ్యేష్ఠ ఉ.11.35 రా.వ.7.31 ల 9.07. ప.దు. 12.35 ల 1.22 పు.దు.2.55 ల 3.42.
 
మేషం :- బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. ముఖ్యమైన వ్యవహారాలలో కొంతమంది మాటతీరు మీకు మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్లు యత్నాలను గుట్టుగా సాగించాలి. వ్యాపారాలకు సంభంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తుల మీద మక్కువ పెరుగుతుంది. 
 
వృషభం :- ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్లమెళకువ వహించండి. ఉద్యోగస్తులు, ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
మిథునం :- ఏజెంట్లకు సదావకాశాలు లభిస్తాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. ప్రైవేటు, పత్రికా రంగాల్లోవారికి అధికారులతో సమస్యలు తప్పవు. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. 
 
కర్కాటకం :- ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగించగలదు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కుటుంబ సౌఖ్యం కొంత తగ్గుతుందనే చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.
 
సింహం :- ఆలయ సందర్శనాలల్లో ఇబ్బందులు తప్పవు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి. ఉద్యోగస్తులకు తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఎదుర్కోంటారు.
 
కన్య :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయుయత్నాలు వాయిదాపడగలవు. వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటుతగదు.
 
తుల :- ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వచేయలేకపోవడటం వల్ల ఆందోళనకు గురవుతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. స్త్రీలకు చుట్టుప్రక్కల వారితో సమస్యలు తలెత్తగలవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- దస్త్రం విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సినిమా, విద్యా, సాంస్కృతిక రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగంలోనివారికి చికాకులు తప్పవు. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు.
 
మకరం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కుంభం :- రుణాలు తీర్చడానికి చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిర్చి, ఆవాలు, నూనె, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారుండరు.
 
మీనం :- బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసేవిషయంలో జాగ్రత్త. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కంప్యూటర్, ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి చికాకులు, పనిభారం అధికం. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు