ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. లావాదేవీలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురికావద్దు. మీ నిర్ణయాలను కచ్చితంగా తెలియజేయండి. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు ఆపివేయొద్దు. ఆప్తులకు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మనోధైర్యంతో అడుగుముందుకేయండి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆప్తులతో సంభాషిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు. ఆదాయం నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయొద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
నిర్దిష్టప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కుటుంబీకులను సంప్రదిస్తారు. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. పత్రాలు అందుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆర్థిక లావాదేవీలు కొలిక్కివస్తాయి. సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
వ్యవహారానుకూలత, ధనలాభం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. పనులు త్వరితగతిన సాగుతాయి. పరిస్థితులకు తగ్గట్టుగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రయాణంలో జాగ్రత్త వహించండి.
పట్టుదలతో యత్నాలు సాగించండి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఊహించని ఖర్చులుంటాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి.
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. ఖర్చులు తగ్గించుకోండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఆప్తుల సలహా పాటించండి. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు.