09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

రామన్

సోమవారం, 9 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. అందరితోనూ మితంగా సంభాషించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్త వింటారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనవసర ఒత్తిడికి గురికావద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. ఆచితూచి అడుగేయండి. పరిచయస్తులతో కాలక్షేపం చేస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వస్త్రప్రాప్తి. వాహనసౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు పురమాయించవద్దు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త, పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే కార్యం సాధ్యమవుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలందిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ధృఢసంకల్పంతో లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు విపరీతం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కీలక బాధ్యతలు చేపడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్భాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. చేపట్టిన పనులపై శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు