15-03-2025 శనివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

రామన్

శనివారం, 15 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
చాకచక్యంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో సంభాషించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మాట నిలబెట్టుకుంటారు. పత్రాల రెన్యువల్లో జాగ్రత్త పడండి. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ముఖ్యం. కొందరి వాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పనులు హడావుడిగా సాగుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడొద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం. సమర్ధతను చాటుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులతో జాగ్రత్త. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వాగ్వాదాలకు దిగివద్దు. అయిన వారితో సంభాషిస్తారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయాలి. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాలి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు.. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. ఆచితూచి వ్యవహరించాలి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. కుటుంబీకులు అన్ని విధాలా సహకరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు