Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

రామన్

ఆదివారం, 15 డిశెంబరు 2024 (04:00 IST)
Today Daily Astro మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు విపరీతం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం ఉంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యులతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ కార్యదీక్ష ఆకట్టుకుంటుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. సన్నిహితులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సామర్ధ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తులను కలుసుకుంటారు. పందాలు, పోటీల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆప్తులకు మీ సమస్యలను తెలియజేయండి. దంపతుల మధ్య అకారణ కలహం. ఖర్చులు అదుపులో ఉండవు. వ్యవహారాలతో తీరిక ఉండదు. పెద్దలతో సంభాషిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొంతమొత్తం ధనం అందుతుంది. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు సామాన్యం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పనులు, కార్యక్రమాలు సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పనులు ఒక పట్టాన సాగవు. దుబారా ఖర్చులు అధికం, ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాల్లో అప్రమత్తంగాఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం తలపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక చర్చల్లో పాల్గొంటారు. మీ పనితీరు ప్రశంనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యతాలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు