Today Daily Astro బుధవారం రాశిఫలాలు - దంపతుల మధ్య సఖ్యత...

రామన్

బుధవారం, 11 డిశెంబరు 2024 (04:00 IST)
Today Daily Astro మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణసమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు ఒకపట్టాన పూర్తి కావు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యం నెరవేరుతుంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీ విజ్ఞతకు ప్రశంసలు లభిస్తాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు సిద్ధం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. మీ కృషికి కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పత్రాలు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వస్త్రప్రాప్తి, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. పనులు పురమాయించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవకాశాలు చేజారిపోతాయి. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనుల్లో శ్రమ అధికం. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రయాణం విరమించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఓర్పుతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఖర్చులు సామ్యాం. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. వేడుకకు హాజరుకాలేరు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మీ నిజాయితీని కొంతమంది శంకిస్తారు. అభియోగాలు పట్టించుకోవద్దు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు