తేదీ 16-02-2023 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం...

గురువారం, 16 ఫిబ్రవరి 2023 (04:00 IST)
మేషం :- హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు సమర్ధతను అధికారులు గుర్తిస్తారు. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థకు గురవుతారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది.
 
మిథునం :- దైవ, సేవా కార్యక్రమాలలో ఇబ్బందులు తప్పవు. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించండి. పత్రికా సంస్థలలోని వారి శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలను అధికమిస్తారు. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు.
 
కర్కాటకం :- ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. ఫ్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
 
సింహం :- భాగస్వామిక సమావేశాలు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. మిత్రుల కలయికతో మనసుకుదుట పడుతుంది. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలకు టివి ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. విద్యార్థుల ప్రేమ వ్యవహారం పెద్దలకు సమస్యగా మారుతుంది. 
 
కన్య :- స్త్రీలలో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. అనుకోకుండా పాతబాకీలు వసూలవుతాయి. మొక్కవోని ధైర్యంతో మీ యత్నాలు కొనసాగించండి. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. రాజీమార్గంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి.
 
తుల :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పిడి, స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. 
 
వృశ్చికం :- పుణక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అసవరం. కొంతమంది మీ నుంచి ధనసహాయం అర్థించవచ్చు జాగ్రత్త వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. 
 
ధనస్సు :- రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ప్రయాసలు అధికమవుతాయి. నూతన రుణాల కోసం చేసే యత్నాలు వాయిదాపడతాయి.
 
మకరం :- విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. బంధువులను దగ్గరవుతారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. రావలసిన ధనం కొంత ముందువెనుకలగానైనా అందుతాయి. విద్యార్థులు ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కుంభం :- వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుంచి బయట పడతారు. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు యత్నించాలి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. స్పెక్యులేషన్ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం :- ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ప్రముఖుల కలియిక ప్రయోజనకరంగా ఉంటుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు, అధికారిక పర్యటనలు అధికమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి