16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

ఠాగూర్

సోమవారం, 16 సెప్టెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. స్థిరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. విందులకు హాజరవుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతగా మెలగాలి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. పత్రాల్లో మార్పులు సాధ్యపడవు. పట్టుదలతో మరోసారి యత్నించండి. సంతానానికి మంచి జరుగుతుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పత్రాలు అందుకుంటారు. బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమస్యలకు ధీటుగా స్పందిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండి. స్నేహ సంబంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. సంతానం దూకుడు కట్టడి చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆప్తులు సాయం అందిస్తారు. ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త పనులు చేపడతారు. అనవసర జోక్యం తగదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. అయిన వారితో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. వేడుకకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఒత్తిళ్లకు గురికావద్దు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటుతనం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. మొహమ్మాటలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోనం. ఆరోగ్యం జాగ్రత్త. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. దుబారా ఖర్చులు విపరీతం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక శుభవార్త సంతోషాన్నిస్తుంది. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు