సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు.
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు.
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితులతో సంభాషిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. మీ సామర్ధ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు.
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆప్తులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు విపరీతం. ఆప్తులను కలుసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి.
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. దూర ప్రయాణం తలపెడతారు.
వ్యవహార ఒప్పదాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు.
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ విజ్ఞత ప్రశంనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదించగల్గుతారు.