కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
వ్యవహారాల్లో ఒప్పందాల్లో జాగ్రత్త. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారు. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు.
సమర్థతను చాటుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రియతములను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ప్రయాణంలో జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టం ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొత్త పరిచయాలు బలపడతాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. లావాదేవీల్లో జాగ్రత్త. ఒత్తిళ్లకు లొంగవద్దు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. రావలసిన ధనం అందుతుంది. చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. ప్రియతములతో సంభాషిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
సంకల్పం సిద్ధిస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. నోటీసులు అందుతాయి. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. మీ నిర్ణయం ఇరు వర్గాలకూ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. బంధువులతో సంభాషిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి.
ఆశావహదృక్పథంతో మెలగండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో పెద్దల సలహా పాటించండి.
ప్రతిభ కనబరుస్తారు. మీ కష్టం వృధా కాదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు పురమాయించవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వేడుకకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.