లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
వ్యవహారంలో తప్పటడుగు వేస్తారు. అంచనాలు ఫలించవు. మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు.
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయిన వారు మీ అసక్తిను అర్థం చేసుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ సమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. అందరితోను మితంగా సంభాషించండి. కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతు తెలుసుకోండి. సావకాశంగా పనులు పూర్తిస్తారు. కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి.
ధైర్యంగా అడుగు ముందుకేయండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆందోళనకు గురికావద్దు. చేపట్టిన పనులు అర్థాంతగా ముగిస్తారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అందరితోను మితంగా సంభాషించండి.
ప్రణాళికలు వేసుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. నోటీసులు అందుకుంటారు. సోదరులను సంప్రదిస్తారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన పూర్తికావు. వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ప్రియతముల వ్యాఖ్యలు కార్మోన్యుఖులను చేస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ముఖ్యులు సందర్శనం వీలుపడదు.