ఆర్థికంగా బాగుంటుంది. అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. నగదు, బంగారం జాగ్రత్త. పరిచయస్తులతో సంభాషిస్తారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలను సమర్ధంగా నడిపిస్తారు. ఆప్తులకు మీ సలహా కలిసివస్తుంది. ధనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొత్త పనులు మెదలెడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణం సజావుగా సాగుతుంది.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాగ్దాటితో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త సమస్య ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
కష్టపడినా ఫలితం ఉండదు. ఓర్పుతో శ్రమించండి. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు.
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ పని మొదలు పెట్టినా మొదటికే వస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. అవకాశాలను వదులుకోవద్దు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
ఇష్టపడి శ్రమిస్తే విజయం తధ్యం. యత్నాలు కొనసాగించండి. స్వయంకృషితో రాణిస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించి భంగపడతారు. చేపట్టిన పనులు సాగవు. ముఖ్యలకు వీడ్కోలు పలుకుతారు.
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దుబారా ఖర్చులు విపరీతం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు.