ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఏ పనీ చేయబుద్ధికాదు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు.
ఈ రోజు అనుకూలం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయుల రాక ఉత్తేజపరుస్తుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశించిన అవకాశం దక్కదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ అశక్తతను కొంతమంది అనుకూలంగా మలుచుకుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. ఆప్తులను కలుసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా మెలగండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశ్రించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్ద మొత్తం సాయం తగదు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రశంసలందుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. విందుకు హాజరవుతారు.
లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. లక్ష్యం నెరవేరుతుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ధార్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి.
ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. విందులు, వేడుకకు హాజరవుతారు.