22-09-2024 ఆదివారం దినఫలితాలు : దైవదీక్షలు స్వీకరిస్తారు...

రామన్

ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మొండిగా పనులు పూర్తిచేస్తారు. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంభాషిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధపెట్టండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి విపరీతంగా శ్రమిస్తారు. సంతానం కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. పరిచయాలు బలపడతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. దంపతులు ఏకాభప్రాయానికి రాగల్గుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. ఉపాధి పథకాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం, అకాలభోజనం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి, అనుభవజ్ఞుల సలహా పాటించండి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. పిల్లల అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 12 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్తిమితంగా పనులు పూర్తి చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆత్మస్థైర్యంతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పనులు మొండిగా పూర్తి చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు మందకొడిగా సాగుతాయి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. ఉన్నతాధికారులకు హోదామార్పు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు