రుణ సమస్య తొలగిపోతుంది. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం. స్నేహసంబంధాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.. దైవదీక్షలు స్వీకరిస్తారు.
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు సామాన్యం. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
లక్ష్యాన్ని సాధిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిసివచ్చే సూచనలున్నాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. పాత పరిచయస్తులు తారసపడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు అధికం, ప్రయోజనకం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
ఓర్పుతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. వేడుకకు హాజరవుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు చేరువవుతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యులను కలుసుకుంటారు. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకుంటారు.
ఒత్తిళ్లకు గురికావద్దు. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పెద్దల హితవు మీ పై పనిచేస్తుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం అవసరం. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.