30-03-2024 శనివారం దినఫలాలు - వాహనం నిదానంగా నడపడం మంచిది...

రామన్

శనివారం, 30 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సంII ఫాల్గుణ బ|| పంచమి సా.5.30 అనూరాధ సా. 6.44 రా.వ.12.26 ల 2.03. ఉ.దు. 6.21 ల 7.55.
 
మేషం :- ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. గృహమునకు కావలసిన వస్తువులను కొనగోలుచేస్తారు. దూరప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
వృషభం :- ముఖ్యవిషయాల్లో కుటుంబీకుల మధ్య ఏకీభావం కుదరదు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు సంతృప్తి కానరాదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి తదను గుణంగా వ్యవహరించంటం మంచిది. 
 
మిథునం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మీదే పైచేయిగా ఉంటుంది. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య విబేధాలు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, కార్మికులకు శ్రమాధిక్యత చికాకు తప్పదు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం కానవస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, పోస్టల్, ఎల్.ఐ.సి., ఏజెంట్లు అతికష్టంమ్మీద టార్గెట్‌ను పూర్తి చేస్తారు. విద్యార్థులపై తోటి వారి ప్రభావం అధికంగా ఉంటుంది. స్థిర, చరాస్తుల విక్రయాలు వాయిదా పడతాయి. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతోముఖ్యం.
 
సింహం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపానలకు ఆమోదం లభిస్తుంది. దైవదర్శనాలు అనుకూలిస్తాయి.
 
కన్య :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, పనివారలో సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పవు. రావలసిన ధనం సమయానికి అందక ఇబ్బందు లెదుర్కుంటారు. స్త్రీలలో ఉత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
తుల :- స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమార్గంలో పయనిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో బాగా రాణిస్తారు. కొన్ని సందర్భాల్లో మీ సమర్థతపై నమ్మకం ఉండదు. వాహనం నిదానంగా నడపడం మంచిది. దుబారా ఖర్చులు అధికం.
 
వృశ్చికం :- ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఆపత్సమయంలో బంధువులు తప్పుకుంటారు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషంచటం మంచిది. విద్యార్థులలో ఏకాగ్రత అవసరం. సాహసయత్నాలకు సరైన సమయం కాదని గ్రహించండి.
 
ధనస్సు :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ కార్యాలయంలో పనులు సకాలంలో పూర్తికావు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం :- రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏజెంట్లకు మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. శత్రువులు మిత్రులుగా మారతారు. రుణం తీర్చితాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బంది అంటూ లేకపోయినా సంతృప్తి కానరాదు. ఉద్యోగస్తులు బదిలీలు, పదోన్నతుల యత్నాలను గుట్టుగా సాగించాలి. మీ ఆంతరంగిక విషయాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. బంధువుల రాక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. పెద్దల ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మీనం :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అవివాహితులకు అందిన ఒక సమాచారం వారిని సందిగ్ధంలో పడవేస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. అనుకున్నపనుల ఒక పట్టాన పూర్తి కావు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు