30-10-2023 ఆదివారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం...
సోమవారం, 30 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ॥ విదియ రా.11.29 భరణి ఉ.6.12 కృత్తిక తె.6.00 సా.వ. 6.06 ల 7.41. ప. దు. 12.14 ల 1.02 పు.దు. 2.37 ల 11.26.
శంకరుడిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది.
మేషం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. చిట్స్, ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. సేవా, పుణ్య కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృషభం :- ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. దైవ దర్శనాలు, దీక్షలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారభమవుతాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి.
మిథునం :- దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. స్త్రీలతో మితంగా సంభాషించండి. ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ గహించండి. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. రచయితలకు, పత్రికారంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది.
కర్కాటకం :- మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. కోర్టు వ్యవహరాలు, ఆస్తి తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది.
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కోర్టు, భాగస్వామిక వ్యవహరాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని రికి మార్పులు అనుకూలించవు.
కన్య :- ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించటంవల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. సోదరుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒక వ్యవహరం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.
తుల :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. విద్యార్థులకు ఒత్తిడి, సహచరులతో పట్టింపులు ఎదురవుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందుకుంటారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో చికాకులు అధికం.
వృశ్చికం :- ఆర్థిక పరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక బలీయమవుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదాపడే అవకాశం ఉంది.
ధనస్సు :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. ధైర్యంతో మందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
మకరం :- ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
కుంభం :- ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వస్త్ర, పచారీ, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోవడానికి ఆస్కారం కలదు. మెళకువ వహించండి.
మీనం :- విదేశాలు వెళ్ళటానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కలసివచ్చేకాలం. బంధు మిత్రుల కలయిక మీకెంతో సంతృప్తి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. నూతనంగా చేపట్టే కార్యక్రమాల్లో ఒడిదుడుకులు తప్పవు.