మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతితో అకారణ కలహం. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.
ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్ష నిర్ణయం తగదు. పనుల్లో చికాకులు అధికం. గృహమరమ్మతులు చేపడతారు. పొరుగు వారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. నగదు, పత్రాలు జాగ్రత్త.
శుభవార్త వింటారు. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరం. సమర్ధతను చాటుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ కష్టం ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వాహనసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సన్నిహితులను కలుసుకుంటారు. పనులు పురమాయించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చెల్లింపుల్లో జాగ్రత్త. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు.
లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. ముఖ్య సమావేశంలో పాల్గొంటారు.
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
వ్యవహారం బెడిసికొడుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. మనోధైర్యంతో మెలగండి. సన్నిహితులు సాయం అందిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం.
రుణ ఆందోళన కలిగిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. పిల్లలకు శుభం జరుగుతుంది. ముఖ్యమైన పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు.
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. వ్యవహారాల్లో మెళకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు. సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ఆహ్వానం అందుకుంటారు.