31-12-22 శనివారం మీ రాశిఫలాలు - ఈశ్వరునికి శనికి తైలాభిషేకం..

శనివారం, 31 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒడిదుడుకులు వంటివి ఎదుర్కొంటారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడతాయి. ఆకస్మికంగా ప్రయాణం వాయిదా వేసుకోవటం ఉత్తమం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. కళ, క్రీడా రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీల మనోవాంఛలు నెరవుగలవు. 
 
వృషభం :- ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులను పట్టించుకు నేందుకు క్షణం తీరిక ఉండదు. దైవ, సేవా, పుణ్యకార్యాలలో నిమగ్నమవుతారు. పొదుపు పథకాలపై శ్రద్ధ వహించండి. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి.
 
మిథునం :- బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తికాగలవు. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు అంతగా ఫలించక పోవచ్చును. నిరుద్యోగులు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. హామీలు, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. భాగస్వామిక ఒప్పందాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. 
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆకర్షణీయమైన పథకాలతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. మిమ్ములను తప్పుత్రోవ పట్టించి లబ్ధి పొందటానికి యత్నిస్తారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు టి.వి., కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. బాధలాంటి వాటిని వదలి సంతోషమైన జీవితాన్ని గడపండి. హోటల్ తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం.
 
కన్య :- స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, పనియందు అంకితభావం అవసరం. విద్యార్థినులు ఒత్తిడి, చికాకులకు గురవుతారు. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
తుల :- హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి లాభదాయకంగా ఉంటుంది. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనిచండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు చురుకుగా సాగుతాయి. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
వృశ్చికం :- విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయ వంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
ధనస్సు :- ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. మీ వాక్చాతుర్యం, లౌక్యంతోఅనుకున్నది సాధిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
మకరం :- బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఆస్తి వ్యవహరాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో ముక్తసరిగా మాట్లాడతారు. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. కూర, పండ్ల, కొబ్బరి, ధాన్య స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. పాత రుణాలు తీరుస్తారు. దూర ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ప్రైవేటు సంస్థలలోనివారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల కోసం బాగా వ్యయం చేస్తారు.
 
మీనం :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు