30-12-22 శుక్రవారం మీ రాశిఫలాలు - సరస్వతి దేవిని ఆరాధించిన శుభం
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (04:07 IST)
మేషం :- ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది. మీ కళత్రమొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. నమ్మకం పట్టుదలతో యత్నాలు సాధించండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అసవరం.
వృషభం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. ప్రైవేటు ఫైనాన్సులో మదుపు చేయటం మంచిది కాదని గమనించండి.
మిథునం :- కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారులకు సామాన్యం. కష్టపడిపనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయంచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
కర్కాటకం :- ఉద్యోగస్తులు అనవసర విషయాలకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్లఆరోగ్యం మందగిస్తుంది. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ఆకస్మిక దూర ప్రయాణాలు తప్పవు.
సింహం :- విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. మీకు, బంధువులకు మధ్య తలెత్తిన కలతలన్నీ దూరమై అంతా కలిసిపోతారు. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
కన్య :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి. తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. పత్రిక, వార్తా సంస్థలలోని వారు అక్షర దోషాలు తలెత్తుకుండా జాగ్రత్త వహించాలి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. బంధువులను కలుసుకుంటారు.
తుల :- డాక్టర్లకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పండ్లు, పూలు, కొబ్బరి, పానీయ వ్యాపారులకు లాభదాయకం. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవటం మంచిది. అసాధ్యమనుకున్న ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
వృశ్చికం :- బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంతటి కార్యానైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు.
ధనస్సు :- దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. రాజకీయ, కళారంగాలవారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలంవ్యర్థం చేయకండి. మీ తప్పులను సరిదిద్దుకోవటానికి యత్నించండి.
మకరం :- రియల్ ఎస్టేట్ రంగాలవారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. ప్రింటింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం.
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. నమ్మకం, పట్టుదలతో మీయత్నాలు సాగించండి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. రుణాల కోసం అన్వేషిస్తారు. భాగస్వామిక సమావేశంలో కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
మీనం :- మీ వాగ్ధాటి, చాకచక్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, చికాకులు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు లాభదాయకం. రాజకీయ నాయకులు సభా, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.