14-05-22 శనివారం రాశిఫలాలు ... వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..

శనివారం, 14 మే 2022 (04:00 IST)
మేషం :- బంధు, మిత్రులరాకతో గృహంలో సందడి నెలకొంటుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు తిరిగి సమకూర్చుకుంటారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
వృషభం :- ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనలు పాల్గొంటారు. క్రీడా, కళా, సాంస్కృక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్యాన్సీ, కిరణా, మందులు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి,
 
మిథునం :- ఆర్థికంగాను, మానసికంగాను కుదుటపడతారు. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.
 
కర్కాటకం :- కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
సింహం :- స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి. బంధు, మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. రాజకీయాల్లో వారు మార్పులను కోరుకుంటారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.
 
కన్య :- శత్రువులు మిత్రులుగా మారతారు. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. రాజకీయనాయకులు తమ వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల :- అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. చేతి వృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఖర్చులు అధికమవుతాయి.
 
వృశ్చికం :- దైవ, సేవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల గురించి కుటుంబీకులతో చర్చలు జరుపుతారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
ధనస్సు :- బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
మకరం :- ఉద్యోగస్తులు కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ సంతానం ఉన్నత విద్యల విషయమై ఒక అవగాహనకు వస్తారు. స్త్రీ మూలకంగా కలహాలు, ఇతరత్రా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. ప్రేమికులకు భంగపాటు తప్పదు.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి, లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. భాగస్వాములకు మీ శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఏర్పడుతుంది. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. ప్రేమికులకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. నిరుద్యోగయత్నాలు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు