లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. కొంతమంది మిమ్ములను నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకేయండి. ఇంటి విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అర్ధాంతంగా పనులు నిలిపివేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరానికి ధనం అందుతుంది. ఆత్మీయులను కలుసుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. సమర్థతకు గుర్తింపు ఉండదు. శ్రమ అధికం, ఫలితం శూన్యం. ఖర్చులు. ధరలు ఆందోళన కలిగిస్తాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లల ధోరణి ఇబ్బంది కలిగిస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతాయి. స్థిరాస్తి ఆదాయం అందుతుంది. ఖర్చులు విపరీతం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఈ రోజు అనుకూలతలు ఉన్నాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఉల్లాసంగా గడుపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
రోజువారీ ఖర్చులే ఉంటాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. దైవ. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని విధాలా బాగుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. వేడుకను ఘనంగా చేస్తారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు.
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అనుకున్న పనులు సకాంలో పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రశంసలు అందుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
లావాదేవీలతో తీరిక ఉండదు. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. చీటికి మాటికి అసహనం చెందుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పొగిడిన వారే మిమ్ములను తప్పుపడతారు.
పట్టుదలకు పోవద్దు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఖర్చులు సామాన్యం. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు సామాన్యం. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. గృహమార్పు సత్ఫలితమిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విదేశీయాన యత్నం ఫలిస్తుంది.