రోజువారీ ఖర్చులే ఉంటాయి, కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు త్వరితగతిన సాగుతాయి. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం, సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రియతములతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు.
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అవకాశాలు చేజారిపోతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది, నిస్తేజానికి లోనవుతారు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ రోజు అనుకూలదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. దూరపు బంధువులను కలుసుకుంటారు.
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు.
వివాహ యత్నం ఫలిస్తుంది. కొత్త బంధుత్వాలేర్పడతాయి. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితులను కలుసుకుంటారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు.
సమయస్ఫూర్తితో మెలుగుతారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు విపరీతం. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు హాజరవుతారు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది.
ధృఢసంకల్పంతో శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. పొడుపు మూలక ధనం గ్రహిస్తారు. పనులు సాగక చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ చిత్తశుద్ధికి ప్రశంసలందుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కీలక పదవి చేపడతారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు.