26-02-2022 శనివారం రాశిఫలితాలు - పెంపుడు జంతువుల పట్ల ఆందోళన...

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపడతాయి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేయడం మంచిది కాదు అని గమనించండి. మీ యత్నాలకు జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృషభం :- ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. పాత మిత్రుల కలయికతో గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃపారంభించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితాలు దక్కుతాయి.
 
కర్కాటకం :- సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఆశయ సాధనకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు నిరుత్సాహం తప్పదు. రావలసిన ధనం అందటంతో ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
సింహం :- పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికుల వల్ల సమస్యలు తప్పవు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. బంధుమిత్రుల నుండి అందిన ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు.
 
కన్య :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. చిన్న చిన్న సమస్యలు లెదురైనా పరిష్కరించుకుంటారు. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది.
 
తుల :- కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఆడంబరాలకు, బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
వృశ్చికం :- సమావేశాలు, వేడుకల్లో చిన్నారులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు అసహనం, నిరుత్సాహం, ఏ విషయం పట్ల ఆసక్తి ఉండకపోవటం వంటి చికాకులు ఎదురవుతాయి.
 
ధనస్సు :- వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల జోక్యం అనివార్యమవుతుంది. ఖర్చులు అధికం కావడం, వృథా ధన వ్యయం వల్ల నిరుత్సాహం చెందుతారు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు.
 
కుంభం :- ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. మిమ్ములను కొంతమంది ధన సహాయం అర్థిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళుతప్పవు. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
 
మీనం :- వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది. బ్యాంకు పనులు, నగదు విషయంలో మెళుకువ అవసరం. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు