గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. మీ సాయంతో ఒకరికి మేలు కలుగుతుంది. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు.
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. గురువారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. వివాదాస్పద విషయాల్లో జోక్యం తగదు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఉద్యోగ విధుల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. కొత్త యత్నాలు మెదలెడతారు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. సంకల్పబలం ప్రధానం. శుక్రవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో మెలగండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. దంపతులు మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. గృహమార్పు అనివార్యం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగ విధులపై శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులకు పనిభారం. ఆరోగ్యం బాగుంటుంది. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
విశేషమైన కార్యసిద్ధి ఉంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మెదలు పెట్టేసరికి అవాంతరాలు ఎదురవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా అడుగు ముందుకేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పరిచయాలు బలపడతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఉద్యోగుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ప్రయాణం చికాకుపరుస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరునస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యాత్మకమవుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆపత్సమయంలో ఆప్తులు సాయం అందిస్తారు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వస్త్ర, బంగారం వ్యాపారాలు జోరుగా సాగుతాయి. పూర్వవిద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు.
గ్రహస్థితి నిరాశాజనకం. వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పంతాలు, భేషజాలకు పోవద్దు ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. సోమవారం నాడు అందరితోను మితంగా మాట్లాడండి. మీ వ్యాఖ్యలు కొందరు వక్రీకరిస్తారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు సదావకాశం లభిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.
విశేష ఫలితాలున్నాయి. సంకల్పబలంతో ముందుకు సాగుతారు. కార్యం సిద్ధిస్తుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు మునుపటి కంటే చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో తరచు కాలక్షేపం చేస్తారు. బుధవారం నాడు వివాదాస్పద విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో సాధ్యం కాని హామీలివ్వవద్దు. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులకు కొత్త సమస్యలెదురవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. శనివారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి.
వ్యవహారాలతో తీరిక ఉండదు. సమయానుకూలంగా మెలగండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. గురువారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. మీ అంచనాలు ఫలిస్తాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుక్రవారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. సంతానం విదేశీ చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, ఏజెన్సీలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతులు అవగాహనకు రాగలుగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
ఈ వారం అన్ని విధాలా అనుకూలమే. ఇతరుల మేలుకోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. అప్రయతంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సంతానం కృషి ఫలిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు లభిస్తాయి. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వాదోపవాదాలకు దిగవద్దు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అపజయాలకు కుంగిపోవద్దు. కృషి, పట్టుదలతోనే లక్ష్యం సాధిస్తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. తలపెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఎదుటివారి అభిప్రాయాలను వ్యతిరేకించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. నగదు, పత్రాలు జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. అలక్ష్యానికి తావివ్వవద్దు. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.