01-05-2023 నుంచి 31-05-2023 వరకు మీ మాస ఫలితాలు

ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (19:40 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. వాగ్ధాటితో రాణిస్తారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సంస్థల స్థాపనకు తరుణం కాదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యవసాయ కార్మికులకు పనులు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆశావహదృక్పథంతో మెలగండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. ఊహించని ఖర్చులెదురవుతాయి. రాబడిపై దృష్టిపెడతారు. ఆప్తుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా మెలగండి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. గృహ మరమ్మతులు చేపడతారు. సోదరీ సోదరులతో ఇబ్బందులెదురవుతాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మిథునరాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతి సోదరీ సోదరులకు అపోహ కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపకాలు అధికమవుతాయి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. మీ సాయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన బదిలీలు. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ప్రతికూలతలకు కుంగిపోవద్దు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పట్టుదలతో వ్యవహరించండి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమర్ధతను చాటుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషాన్నిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయులకు స్థానచలనం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. మీ సమర్థత మరొకరికి కలసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెదురవుతాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. సహోద్యోగులతో జాగ్రత్త. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. గృహ యజమానులకు కొత్త సమస్యలెదురవవుతాయి.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గృహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ధనమూలక సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. పనులు సానుకూలమవుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితమిస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట,
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. లక్ష్యసాధనకు మరింతగా శ్రమించాలి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహ మరమ్మతులు చేపడతారు. వైద్య, న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త పనులు చేపడతారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు స్కారం ఉంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆప్తుల సలహా పాటించండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదామార్పు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలున్నాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. గృహమార్పు అనివార్యం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిసాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి స్థానచలనం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు