01-03-2023 నుంచి 31-03-2023 వరకు మీ మాస ఫలితాలు

మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (20:30 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అన్ని రంగాల వారికి ప్రతికూలతలు అధికం. కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఖర్చులు విపరీతం. ధనమూలక సమస్యలెదురవుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య తరచూ కలహాలు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు ఫలితం అంతగా ఉండదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వృత్తుల వారికి సామాన్యం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు విపరీం. ధనన సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ తగదు. దంపతుల మధ్య తరచూ కలహాలు. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. గృహమార్పు అనివార్యం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మిథునరాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. మీ ఉన్నతిని చాటుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పెందుతారు. మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు. ఉపాధ్యాయులకు పనిభారం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి అభిప్రాయాలతో ఏకీభవించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆప్తులతో సంభాషణ ఊరటనిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం అనుకూలతలు అంతగా ఉండవు. ఆచితూచి వ్యవహరించాలి. యత్నాల్లో లోపం లేకుండా శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మందకొడిగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. సోదరుల మధ్య కొత్త విషయలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల సమర్ధత అధికారులకు లాభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుందని. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. అధికారులకు ఇబ్బందులెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పాత పరిచయస్తుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితులు శుభవార్త వింటారు. సోదరీ సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. యోగ, ఆధ్యాత్మికతల పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తుల వారికి పురోభివృద్ధి. 
 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం యోగదాయకం. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. మీ వ్యక్తిత్వానికి తగు గౌరవం లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి, మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రతికూలతలు అధికం. ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతారు. రుణ సమస్యలు వేధిస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనరాశి పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య తరచూకలహాలు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆప్తుల రాకతో కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు నిదానంగా సత్ఫలితమిస్తాయి. సాంకేతిక రంగాల వారికి సామాన్యం. విద్యార్థులకు ఒత్తిడి, ఏకాగ్రత లోపం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు