01-12-2018 నుండి 31-12-2018 వరకు మీ మాస రాశిఫలితాలు
శనివారం, 1 డిశెంబరు 2018 (09:47 IST)
కర్కాటకంలో రాహువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి, వక్రీ బుధ, గురువు, ధనస్సులో శని, మకరంలో కేతువు, కుంభంలో కుజుడు. 6వ తేదిన బుధునికి వక్ర త్యాగం. 16వ తేదిన రవి ధనుర్ ప్రవేశం. 23వ తేదిన కుజుడు మీన ప్రవేశం. 3వ తేదిన సర్వ ఏకాదశి. 5వ తేదిన మాసశివరాత్రి. 8వ తేదిన పోలీ స్వర్గం. 10వ తేదిన గురు మౌడ్యమి త్యాగం. 13వ తేదిన సుబ్రమణ్య షష్టి. 16వ తేదిన ధనుర్ సంక్రమణం. 18వ తేదిన ముక్కోటి. 22వ తేదిన సంకటహర చతుర్థి.
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. సోదరీసోదరుల వైఖరి అసహానం కలిగిస్తంది. కార్యానుకూలతకు మరింత శ్రమించాలి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ధనసహాయం అర్థించేందుకు సందేహిస్తారు. అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలు పట్టించుకోండి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఓర్పుతో మెలగాలి, ఆధిపత్యం ప్రదర్శించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. దైవకార్యాల్లో పాల్గొంటారు. పందాలు, క్రీడా కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు.
ఈ మాసం ద్వితీయార్థం కలిసివస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పెట్టుబడులపై దృష్టిపెడతారు. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహనిర్మాణాలు, మరమ్మత్తులకు అనుకూలం. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. జూదాల జోలికి పోవద్దు. ప్రయాణం కలిసివస్తుంది.
కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. వేడుకలు, శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆభరణాలు, కీలక పత్రాలు జాగ్రత్త. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సబంధాలు నెలకొంటాయి. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు.
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ నిర్ణయాన్ని లౌక్యంగా వ్యక్తం చేయండి. స్వయంకృషితో రాణిస్తారు. ధనలాభం ఉంది. రుణ ఒత్తిడి తొలగి కుదుటపడుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అధికం, ధనానికి లోటుండదు. సంతానం దూకుడును అదుపు చేయండి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం యోగదాయకమే. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పదవులు స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక బందువులకు సంతోషం కలిగిస్తుంది. విలువైన కానుకలు చదివించుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు, విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. యువతకు అత్యుత్సాహం తగదు.
వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పుతాయి. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిగివస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. గృహ మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. దైవదీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. విదేశాల నుండి ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. జూదాల జోలికి పోవద్దు.
అన్ని రంగాల వారికి శుభదాయకమే. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కష్టం ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. శుభకార్యం, వేడుకలపై దృష్టి పెడతారు. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించండి. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పూర్వ విద్యార్థులు, గురువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త.
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. రుణ ఒత్తిళ్లు అధికం. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చీటికిమాటికి అసహానం ప్రదర్శిస్తారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పరిస్థితులు క్రమంగా చక్కబడుతాయి. పెద్దల సలహా పాటించండి. కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. విందులు, వేడుకల్లో మితంగా ఉండాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వాహన చోదకులకు దూకుడు తగదు.
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులకు అంతుండదు. రాబడిపై దృష్టి పెడతారు. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కుంటారు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. సంయమనంతో పరిష్కరించుకోవాలి. ఎవరినీ నొప్పించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. సన్నిహితుల సాయం అందుతుంది. గృహమార్పు కలిసివస్తుంది. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
ఈ మాసం ప్రథమార్థం అనుకూలం. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడుతాయి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పనులు సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
శుభకార్యం నిశ్చయమవుతుంది. స్తోమతకు మించి హామీల్వివద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా వ్యక్తం చేయండి. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలుచేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి ఉపాధఇ పథకాల్లో రాణిస్తారు. వస్త్ర, పచారీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. భాగస్వామి చర్చలు కొలిక్కి వస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. క్రీడా పోటీల్లో పాల్గొంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వాహన చోదకులకు దూకుడు తగదు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలకు ఉండదు. దుబారా ఖర్చలు విపరీతం. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ప్రముఖుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. చిన్ననాటి పరచయస్తులను కలుసుకుంటారు. గత జ్ఞాపకాలు కొత్త అనుభూతినిస్తాయి. వేడుకలు, శుభకార్యంలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. జన సంబంధాలు బలపడుతాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. క్రీడా, కళాత్మక పోటీలు నిరుత్సాహపరుస్తాయి.